అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కు షూట్ షురూ !

Update: 2025-03-04 12:57 GMT

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 చివరి దశ షూటింగ్‌కు చేరుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా మార్చి 4 నుంచి ఓ గ్రాండ్ డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ మొదలైంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ముంబయిలోని యశ్ రాజ్ స్టూడియోలో జరుగుతున్న ఈ షుటింగ్‌లో 500 మందికిపైగా డాన్సర్లు పాల్గొంటున్నారు.

హృతిక్ రోషన్ తన స్టైలిష్ డాన్స్ మూమెంట్స్‌తో, ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ స్టెప్పులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు. ఇద్దరూ దేశంలోని బెస్ట్ డాన్సర్స్ కావడంతో, ఈ డాన్స్ ఆఫ్ సినిమాకి హైలైట్ కానుందనేది స్పష్టం. ఈ పాట షూటింగ్ మొత్తం ఆరు రోజుల పాటు జరుగనుండగా, సినిమా కథలో కీలకమైన ఘట్టానికి ఈ సాంగ్ బ్యాక్‌డ్రాప్‌గా నిలవనుంది.

డాన్స్ మాత్రమే కాదు, వార్ 2 లో హృతిక్-ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న ఫేస్‌ఆఫ్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్రే షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్లింగ్ కాన్ఫ్రంటేషన్స్ ఈ సినిమాను మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ పాట షూటింగ్ పూర్తయిన వెంటనే వార్ 2 షూటింగ్ అధికారికంగా ముగియనుంది. ఆ తర్వాత సినిమా పూర్తిగా పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించనుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2019 లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది. వార్ 2 కూడా వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగమైన మరో పవర్‌ఫుల్ మూవీగా ఇండిపెండెన్స్ డే వారాంతంలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tags:    

Similar News