రిలీజ్ డేట్ మారింది !

వీఎఫ్ఎక్స్ అవసరం ఉండటంతో, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-04-15 13:35 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ యాక్షన్ కామెడీ చిత్రం ‘ద భూత్నీ’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా మార్చారు. ఈ చిత్రం మొదటగా ఈనెల 18న విడుదలవ్వాల్సి ఉండగా.. అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ అవసరం ఉండటంతో, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో మౌని రాయ్, సన్నీ సింగ్, పలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్, బేయోనిక్ వంటి నటీనటులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ముంబయిలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది.

సిద్ధాంత్ సచ్దేవ్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా విభిన్నమైన శైలిలో రూపొందింది. హారర్ , యాక్షన్, వినోదం అన్నీ మేళవించి ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ట్రైలర్‌లో కథను పూర్తిగా వెల్లడించకపోయినా, సినిమా ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. హారర్ లో కామెడీ, యాక్షన్ మేళవింపుతో ఓ కొత్త ప్రయోగం.

ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్ కలిసి సమర్పిస్తున్నాయి. దీన్ని సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా, దీపక్ ముఖత్ మరియు సంజయ్ దత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హునర్ ముఖత్ , మానయతా దత్ సహ నిర్మాతలు. జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని భయపెట్టి నవ్వి్స్తుందో చూడాలి. 

Tags:    

Similar News