సల్మాన్ నెక్ట్స్ డైరెక్టర్ ఇతడేనా?
తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ తన తదుపరి సినిమా కోసం దర్శకుడిగా అపూర్వ లాఖియాను ఫైనల్ చేశారని సమాచారం. అపూర్వ లాఖియా గతంలో ఎక్కువగా ఫ్లాప్ చిత్రాలనే అందించాడు.;
ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ నుంచి ఒక మంచి హిట్ చిత్రం రాలేదని అభిమానులు నిరాశగా ఉన్నారు. గత ఈద్‌కు విడుదలైన "సికందర్" సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొటీన్ గా బోరుగా ఉండటంతో, సల్మాన్ ఖాన్, మురుగదాస్ ఇద్దరూ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇప్పుడు అందరి చూపు సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రంపై ఉంది. అయితే.. తాజాగా వెలువడిన వార్తలు ఆయన అభిమానులను మరింత నిరాశపరిచేలా ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ తన తదుపరి సినిమా కోసం దర్శకుడిగా అపూర్వ లాఖియాను ఫైనల్ చేశారని సమాచారం. అపూర్వ లాఖియా గతంలో ఎక్కువగా ఫ్లాప్ చిత్రాలనే అందించాడు. నిజానికి అలీ అబ్బాస్ జాఫర్, అనీష్ బజ్మీ, కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ పేరియస్వామి లాంటి ప్రముఖ దర్శకులు మంచి కథలతో వెళ్లినప్పటికీ, అపూర్వ లాఖియా కథే సల్మాన్‌కు బాగా నచ్చిందట.
ఈ సినిమా "ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3" అనే నవల ఆధారంగా ఉండబోతోంది. కథా నేపథ్యం 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఘర్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రం 2025 జూలైలో షూటింగ్ ప్రారంభించనుందని, లడాఖ్ మరియు ముంబయిల్లో మొత్తం 70 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుందని నివేదిక పేర్కొంది.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక భారత సైనిక అధికారిగా కనిపించనున్నాడు. అతనితో పాటు ముగ్గురు యువ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటించబో తున్నారని సమాచారం. అపూర్వ లాఖియా తన గత ఫ్లాపులను అధిగమించి సల్మాన్ ఖాన్‌కి ఒక పెద్ద హిట్ ఇవ్వగలడా? లేక అభిమానులను మరోసారి నిరాశపరిచిపోతాడా? అన్నది వేచి చూడాల్సిందే.