శుక్రవారం కాకుండా ఆదివారం రిలీజేంటో?
ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించినా.. ఇప్పుడు మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.;
సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’. ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించినా.. ఇప్పుడు మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఆసక్తికరంగా... సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా శుక్రవారం కాకుండా ఆదివారం విడుదల చేయడం గమనార్హం.
తాజాగా సల్మాన్ .. సికందర్ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ, "మార్చి 30న థియేటర్లలో కలుద్దాం.. ‘సికందర్’ అని తన క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఇలా.. సల్మాన్ ఖాన్ తన చిత్రాలను వేరుగా విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ కూడా ఆదివారం విడుదలైంది. ఎందుకంటే అది దీపావళి రోజు కాబట్టి.
"సాంప్రదాయ మార్గంలో వెళ్లడమే మంచిదని, లేకపోతే కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదని మేము ఎప్పుడూ నమ్ముతాం. అయితే ఈ సందర్భంలో.. మొదటి రోజు వసూళ్లను దృష్టిలో పెట్టుకోవడం కన్నా.. సినిమాకు ఏది మంచిదో అదే ఆలోచించాం. అందుకే సికందర్ విడుదలను ఆదివారం నాడు ఫిక్స్ చేశాం’’ అని మేకర్స్ తెలిపారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికందర్ చిత్రంలో .. రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.