‘సికందర్’ గా సల్మాన్ ఖాన్ మాస్ ట్రీట్ !
మూడు నిమిషాల 38 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ లో యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, సీక్రెట్ ట్విస్ట్‌లతో థ్రిల్ పెంచింది.;
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సికందర్’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మార్చి 30న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్ర ట్రైలర్ అభిమానుల అంచనాలను మించిపోయింది. మూడు నిమిషాల 38 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ లో యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, సీక్రెట్ ట్విస్ట్‌లతో థ్రిల్ పెంచింది. సల్మాన్ ఖాన్ కొత్త లుక్, భీకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ట్రైలర్ చూస్తే సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, భావోద్వేగాలతో కూడిన కథ అని స్పష్టమవుతుంది. ‘సికందర్’ పాత్రను అంత భీకరంగా మారేలా చేసిన పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్ సాగుతుంది. అత్యంత స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, స్లో మోషన్ ఫైట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే కథలోని భావోద్వేగ బలాన్ని కూడా నాటిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత గ్రావిటీ అందించడంతో పాటు మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘సికందర్’ స్థాయిని పెంచుతుంది.
రష్మికా మందన్న పాత్రపై ఆసక్తి నెలకొంది. టీజర్‌ల్లో తక్కువగా కనిపించిన ఆమె, ఈ ట్రైలర్‌లో తగిన ప్రాధాన్యం సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్‌తో ఆమె కెమిస్ట్రీ ఆసక్తికరంగా ఉండగా, ఆమె పాత్ర కథలో కీలకంగా మారుతుందని టీజర్ సూచిస్తోంది. అయితే ఆమె పాత్ర చివరకు బతుకుతుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా ఉంచారు. దీనిపై అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
మరో ఆసక్తికరమైన అంశం కాజల్ అగర్వాల్ పాత్ర. ఇప్పటివరకు ఆమె క్యారెక్టర్ గురించి పెద్దగా బయటకు రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముందుగా చెప్పిన “సర్ప్రైజ్ ఎలిమెంట్” ఏమిటనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాజల్ పాత్ర కథలో ఎలా మలుపులు తీసుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
సినిమా యాక్షన్ ప్రధానాంశమైనా, ఎమోషనల్ గా కూడా బలంగా ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ప్రతీకారం అనే కాన్సెప్ట్‌ను రెండు టైమ్‌ఫ్రేమ్‌ల్లో చూపిస్తూ, కుటుంబ బంధాలు, భర్త-భార్య మధ్య ఉన్న అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించేలా కథ సాగనుంది.
అన్నింటినీ కలిపి చూస్తే ‘సికందర్’ మాస్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఓ గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని చెప్పొచ్చు. సల్మాన్ ఖాన్ తన సూపర్ యాక్షన్ మోడ్‌లోకి తిరిగి వచ్చాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది.