క్రేజీ సౌత్ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ ?
తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్‌తో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్లోనే మోస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గత చిత్రం "సికందర్" ఘోరంగా ఫెయిల్ అవడంతో.. అభిమానులు అతని తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్‌తో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్లోనే మోస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం.
ప్రస్తుతం, సల్మాన్ అపూర్వ లాఖియా దర్శకత్వంలో వార్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే.. మహేశ్ నారాయణ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతాడు. ఇంట్రెస్టింగ్గా.. ఇది మహేష్ నారాయణన్‌తో సినిమా అతని మొదటి హిందీ సినిమా అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి మరియు అతని బావ అతుల్ అగ్నిహోత్రి కలిసి నిర్మిస్తున్నారని సమాచారం.
నిజానికి సల్మాన్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి ఎలాంటి అప్డేట్స్ ఇంకా షేర్ చేయలేదు. అయితే అతను మహేష్ నారాయణన్‌తో కలిసి పనిచేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు అతని తదుపరి సినిమా గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌత్ దర్శకులతో పనిచేయడం ట్రెండ్ గా మారింది. ఈ నేపథ్యంలో సల్మాన్ అండ్ మహేశ్ నారాయణన్ ప్రాజెక్ట్ ఆసక్తిగా మారింది. మలయాళంలో ‘టేకాఫ్, సీయూ సూన్, మాలిక్, అరియిప్పు’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన మహేశ్ నారాయణ సల్మాన్ కోసం ఎలాంటి కథాంశం ఎంచుకుంటాడో చూడాలి.