ఈ ఇద్దరి మల్టీస్టారర్ కు అదిరిపోయే టైటిల్?
తాజా సమాచారం మేరకు ఈ యాక్షన్ సినిమాకు 'గంగారాం' అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2025 జూన్ లేదా జూలై నెలలలో ప్రారంభం కావొచ్చని సమాచారం.;
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కలిసి మరోసారి స్ర్కీన్ షేర్ చేసుకోబోతుండడం అభిమానుల్ని ఎంతగానో ఖుషీ చేస్తోంది. ఈ ఇద్దరు ప్రముఖ నటులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాంటి కథ కోసం వారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారని సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ యాక్షన్ సినిమాకు 'గంగారాం' అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2025 జూన్ లేదా జూలై నెలలలో ప్రారంభం కావొచ్చని సమాచారం.
సల్మాన్ అండ్ సంజయ్ కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం అంటే వారికి చాలా ఇష్టం. ఇద్దరి కెరీర్ బిగినింగ్ లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ.. గత కొంతకాలంగా ఇద్దరూ కలిసి నటించలేదు. అయితే ఈ యాక్షన్ అండ్ అడ్వెంచర్ కథ వినగానే వారు వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమాను ఒక డెబ్యూట్ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడు" అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కృష్ణ అహిర్ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాకు డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కూడా సల్మాన్ ఖాన్ , ఆయన ప్రొడక్షన్ హౌస్ ద్వారా జరుగుతోందని కొన్ని వార్తలు చెబుతున్నాయి. సల్మాన్ అండ్ సంజయ్ కలయికను తెరపై మళ్లీ చూడబోతున్నందుకు చిత్ర బృందం చాలా ఎగ్జైటెడ్‌గా ఉందని సమాచారం.
ఇటీవల సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇద్దరూ కలిసి దుబాయ్ లో కనబడిన విషయం తెలిసిందే. అక్కడ వారు తమ అంతర్జాతీయ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు. అది 2021లో వచ్చిన అర్జెంటీనా సినిమా 'సెవెన్ డాగ్స్' యొక్క రీమేక్‌గా రూపొందుతోంది. ఇక సంజయ్ దత్ ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి 'ది రాజా సాబ్ ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్న మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. మరి ‘గంగారాం’ గా సల్మాన్ అండ్ సంజయ్ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని మెప్పిస్తారో చూడాలి.