అబుదాబిలో సల్మాన్, నోరా బంగారు విగ్రహాలు !

సల్మాన్, నోరా ఫతేహి బంగారు విగ్రహాలు అబుదాబిలో ఏర్పాటు అయ్యాయనే వార్త ఊహించని రీతిలో వైరల్ అయ్యింది.;

By :  K R K
Update: 2025-03-22 05:14 GMT

బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఇద్దరు స్టార్స్ సల్మాన్ ఖాన్, నోరా ఫతేహి. సినిమాలు, సంగీతం, వైరల్ మూమెంట్స్.. ఏదైనా వీరి చుట్టూ హడావుడి తప్పదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన ఈద్ రిలీజ్ "సికందర్" కోసం తెగ ప్రమోషన్స్ చేస్తుండగా.. నోరా ఫతేహి మ్యూజిక్ వీడియోలతో ట్రెండ్స్‌ను క్రియేట్ చేస్తోంది.

ఇలాంటి సమయంలో.. వీరి బంగారు విగ్రహాలు అబుదాబిలో ఏర్పాటు అయ్యాయనే వార్త ఊహించని రీతిలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ విగ్రహాల ఫోటోలు దూసుకుపోగా.. నమ్మే వాళ్లకన్నా ప్రశ్నించే వాళ్లే ఎక్కువయ్యారు. కానీ.. వాస్తవాన్ని పరిశీలిస్తే అలాంటి విగ్రహాలేమీ అబుదాబిలో లేవు.

నిపుణుల కథనం ప్రకారం, ఇవన్నీ ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ విగ్రహాల చిత్రాలు. అయినప్పటికీ, నమ్మే వారు ఇంకా ఈ అంశంపై చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టం సల్మాన్, నోరాల స్టార్ పవర్ అసలు తగ్గడం లేదు. "సికందర్" రిలీజ్‌తో పాటు, నోరా కొత్త ప్రాజెక్టులతో మరోసారి వీరు వైరల్ కానుండటం ఖాయం.

Tags:    

Similar News