డిస్చార్జ్ అయ్యాకా.. తొలిసారిగా కెమేరా కంటికి చిక్కిన సైఫ్
సైఫ్ నేవీ బ్లూ టీషర్ట్, డెనిమ్ జీన్స్, సన్‌గ్లాసెస్ ధరించి తన ఇంటి నుంచి బయటకు వస్తూ, పోలీసు అధికారులతో చుట్టుముట్టబడినట్లు కనిపిస్తున్నాడు.;
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ ఈ వారం ఆరంభంలో.. సైఫ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిన తరువాత తొలిసారిగా కలిసి కనిపించారు. ఆన్‌లైన్‌లో పంచుకున్న వీడియోల్లో.. ఈ జంట బాంద్రాలోని తమ నివాసం నుంచి భద్రతా సిబ్బంది నడుమ బయటకు వస్తున్నట్లు చూడవచ్చు. అనంతరం సైఫ్ తనయుడు ఇబ్రహీం కూడా ఆయనను పరామర్శించేందుకు వచ్చాడు.
ఒక వీడియోలో .. సైఫ్.. నేవీ బ్లూ టీషర్ట్, డెనిమ్ జీన్స్, సన్‌గ్లాసెస్ ధరించి తన ఇంటి నుంచి బయటకు వస్తూ, పోలీసు అధికారులతో చుట్టుముట్టబడినట్లు కనిపిస్తున్నాడు. అనంతరం భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్‌లో అతడి కారులో బయలుదేరారు. మరో వీడియోలో.. కరీనా స్వెట్షర్ట్ , జాగర్స్ ధరించి తన ఇంటి వైపుగా పరుగెత్తుతూ వెళ్లినట్లు కనిపిస్తుంది. ఆమె తరువాత సైఫ్ కూడా ఇంట్లోకి ప్రవేశించారు. తర్వాత సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనను పరామర్శించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇబ్రహీం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
గత వారం.. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చొరబడ్డ దొంగ ఒకడు సైఫ్‌ను దాదాపు ఆరు సార్లు కత్తితో గాయపరిచాడు. అయితే, సైఫ్ ధైర్యంగా అతనితో పోరాడి గాయపడినప్పటికీ.. తనే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. సైఫ్‌కు రెండు శస్త్రచికిత్సలు నిర్వహించగా.. జనవరి 21న అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.