రాత్రిపూట షూట్స్ లో పాల్గొంటున్న రష్మికా మందన్న

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అందమైన రాత్రి ఆకాశాన్ని చూపిస్తూ... “కొన్ని రోజులు రాత్రిపూటే షూటింగ్.. కాబట్టి మీకు కనిపించబోయే పోస్టులు లేదా స్టోరీలు అంటే చంద్రుడు, కెమెరా లైట్లు, లేదా నక్షత్రాలు అర్థమౌతోందా? అంటూ రష్మిక తనదైన శైలిలో పేర్కొంది.;

By :  K R K
Update: 2025-04-11 00:54 GMT

ఒమన్‌లో తన 29వ పుట్టినరోజును జరుపుకున్న రష్మిక మందన్నా, ఇప్పుడు మళ్లీ వర్క్ మోడ్‌లోకి వచ్చింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం “థమా” కోసం ఆమె రాత్రిపూట షూటింగ్స్ ను తిరిగి ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అందమైన రాత్రి ఆకాశాన్ని చూపిస్తూ... “కొన్ని రోజులు రాత్రిపూటే షూటింగ్.. కాబట్టి మీకు కనిపించబోయే పోస్టులు లేదా స్టోరీలు అంటే చంద్రుడు, కెమెరా లైట్లు, లేదా నక్షత్రాలు అర్థమౌతోందా? అంటూ రష్మిక తనదైన శైలిలో పేర్కొంది.

ఇప్పటికే మార్చిలో.. రష్మిక రాత్రిపూట షూటింగ్స్ తో ఎవరు బిజీగా ఉంచుతున్నారు అనే విషయం వెల్లడించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, “థమా” దర్శకుడు ఆదిత్య ఏ సర్పోట్దార్‌ను ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని.. మానిటర్‌లో షాట్‌ను గమనిస్తూ ఉన్న కేండిడ్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు క్యాప్షన్‌గా “నా డైరెక్టర్… ప్రతీసారీ నన్ను రాత్రిపూటే షూట్ చేయిస్తారు... ఐస్ బకెట్.. ఇది నా జీవిత కథ” అని రాసింది.

ఆ ఫోటోను దర్శకుడు ఆదిత్య వెంటనే రీషేర్ చేస్తూ.. “చీకటిలో భయపడే మానవులు ఉన్నారు. కానీ అంధకారమే వాంపైర్‌లకు శక్తి ఇస్తుంది...” అంటూ రాశారు. దానికి రష్మిక స్పందిస్తూ.. “చక్కటి మాటలు. వాంపైర్‌ను ఎలా హ్యాపీగా ఉంచాలో బాగా తెలుసు..” అని పేర్కొంది. ఇక “థమా” కథ విషయానికొస్తే – ఒక పట్టుదల కలిగిన చరిత్రకారుడు, పురాతన గ్రంథాల అధ్యయనం చేస్తూ, ఒక ఊరి వాంపైర్ కథల వెనుక దాగిన మాయాబలాల్ని వెలికితీయడం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రయాణం ద్వారా అతను మరచిపోయిన చరిత్రను వెలుగులోకి తీసుకొస్తాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఆత్మల కోసం ఒక ఉగ్ర సంగ్రామం ప్రారంభమవుతుంది.

“ముంజ్యా” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య సర్పోట్దార్, మొదటిసారిగా రష్మిక మరియు ఆయుష్మాన్‌తో కలిసి పనిచేస్తున్నారు. దినేశ్ విజన్, అమర్ కౌశిక్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, నిరెన్ భట్, సురేష్ మాథ్యూ, అరుణ్ ఫులారా కథను రాశారు. మాడాక్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రంలో పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న “థమా”.. రక్తపాతం నిండిన నేపథ్యంతో కూడిన ఒక హృద్యమైన ప్రేమకథగా ఉండబోతోందని సమాచారం.

Tags:    

Similar News