మహారాణి ఏసుబాయిగా అదరగొడుతున్న రష్మిక

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ జోడీగా నటిస్తున్న బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ‘చావా’.;

By :  K R K
Update: 2025-01-21 13:42 GMT

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ జోడీగా నటిస్తున్న బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ‘చావా’. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కలిగిస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దినేష్ విజయన్ దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న మహారాణి ఏసుబాయి పాత్రలో, విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు. అక్షయ్‌ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, టీజర్లు, రష్మిక లుక్స్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 22న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుందని తెలియజేస్తూ, “అగ్ని భీ హో, పానీ భీ హో, తుఫాను భీ హో, షేర్ శివాకా నీడ ‘చావా’” అనే శక్తివంతమైన క్యాప్షన్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. మహారాణి ఏసు బాయి గెటప్‌లో రష్మిక కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమా అభిమానుల్లో అధిక ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

Tags:    

Similar News