బాలీవుడ్ సీక్వెల్ లో నేషనల్ క్రష్ ?

ఈ నేపథ్యంలో ఈ పాత్ర కోసం తాజాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-04-11 12:51 GMT

ఇప్పటి వరకూ బాలీవుడ్‌లో ఎన్నో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలు వచ్చాయి. అటువంటి సినిమాల్లో 'కాక్టెయిల్' ఒకటి. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోణే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి... ఈ జానర్‌లో ఎంతో ఫాలోయింగ్ సంపాదించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీని పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

ఇప్పటికే ప్రధాన పాత్రల కోసం నటులను ఖరారు చేసినట్లు సమాచారం. షాహిద్ కపూర్, కృతి సనన్ ఇద్దరూ లీడ్ రోల్స్‌కి ఫిక్స్ అయ్యారు. ఇక మూడవ ప్రధాన పాత్ర కోసం ఒక సౌత్‌ ఇండియన్ హీరోయిన్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర కోసం తాజాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమెకు ఈ సినిమాలో మూడవ ప్రధాన పాత్ర దక్కనుందని చెబుతున్నారు. నిజానికి మొదటి భాగంలోనూ ముగ్గురు లీడ్‌ క్యారెక్టర్స్ ఉన్నారు, అలాగే ఈ సీక్వెల్‌లోనూ అదే ఫార్మాట్‌ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా మొదటి భాగం ఎంత కల్చరల్‌గా క్రేజ్ సంపాదించిందో అందుకు తగ్గట్టుగానే ... ఈ సీక్వెల్ పైనా భారీ అంచనాలు కలుగుతున్నాయి. అందువల్ల రష్మిక మందన్నాకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. బాలీవుడ్‌లో ఆమె స్థిరపడే దిశగా ఇది ఒక కీలక అడుగుగా మారొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. రష్మికను ఖరారు చేయాలన్న నిర్ణయం తుది దశకు చేరే వరకు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News