షారుఖ్ ఖాన్ సినిమాలో రాణీ ముఖర్జీ ?

నిన్నటి తరం అందాల హీరోయిన్ రాణీ ముఖర్జీ కూడా "కింగ్" చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఆమె సుహానా ఖాన్ తల్లి పాత్రలో కనిపించనుంది.;

By :  K R K
Update: 2025-05-17 13:53 GMT

‘పఠాన్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాద్షా షారుఖ్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో మరోసారి "కింగ్" అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రెడ్ చిల్లీస్, మార్‌ఫ్లిక్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీగా నటిస్తున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తొలిసారి వెండితెర డెబ్యూ ఇస్తోంది. ఇంకా అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్, అభయ్ వర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇంక.. నిన్నటి తరం అందాల హీరోయిన్ రాణీ ముఖర్జీ కూడా "కింగ్" చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఆమె సుహానా ఖాన్ తల్లి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కథలో కీలకమైనదని, కేవలం ఐదు రోజుల షూటింగ్‌తో ఆమె తన భాగం పూర్తి చేస్తుందని సమాచారం. ఈ పాత్ర సినిమాకు భావోద్వేగ బలాన్ని ఇస్తుందని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ ప్రతిపాదన విన్న వెంటనే రాణీ ఈ పాత్రకు ఒప్పుకున్నట్టు టాక్. గతంలో రాణి ముఖర్జీ షారుఖ్ సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ మే 20 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూరప్‌లో కొనసాగుతుంది. "కింగ్" 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో విడుదల కానుంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక హంతకుడి పాత్రలో, అభిషేక్ బచ్చన్‌తో తలపడనున్నాడు. మరి కింగ్ చిత్రం షారుఖ్ ఖాన్ ను ఏ రేంజ్ లో సినిమా అవుతుందో చూడాలి.

Tags:    

Similar News