రామ, రావణ యుద్ధానికి సన్నాహాలు!

Update: 2025-03-09 12:12 GMT

బాలీవుడ్ నుంచి రాబోతున్న మైథలాజికల్ మూవీ 'రామాయణ'. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' రెండు భాగాలుగా రెడీ అవుతుంది.

ఇటీవల ఈ చిత్రం కోసం ముంబైలో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసింది టీమ్. వచ్చే వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుందట. రణబీర్ కపూర్, యష్‌లపై ఆ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ముఖ్యంగా శ్రీరామ, రావణ మధ్య సాగే యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారట.

ఇప్పటికే పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని కథన పరంగా, దృశ్య పరంగా అత్యున్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ 'రామాయణ'ను పలు భాషల్లో విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News