‘సికందర్’ థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ !

ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 30న సల్మాన్ ఖాన్ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.;

By :  K R K
Update: 2025-03-22 04:52 GMT

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రైడ్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, 2018లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ‘రైడ్’ కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో అజయ్ దేవగణ్ అవినీతిని ఎదిరించే ఐఆర్‌ఎస్ అధికారి అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించనున్నారు. రితేశ్ దేశ్‌ముఖ్, వాణీ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 30న సల్మాన్ ఖాన్ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజయ్ దేవగణ్ చేతిలో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’, ‘దే దే ప్యార్ దే 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Tags:    

Similar News