నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్!

Update: 2025-03-15 10:07 GMT

హైదరాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ బాలీవుడ్ లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో 'సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్' వంటి వరుస సినిమాలు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయంతో ఈ అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది.

ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌ తో 'హరిహర వీరమల్లు', ప్రభాస్ తో 'రాజా సాబ్' వంటి సినిమాల్లో కథానాయికగా ఎంపికైంది. 'హరిహర వీర మల్లు, ది రాజాసాబ్' చిత్రాల షూటింగ్‌లు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో, నిధి ఇతర ప్రాజెక్టులు ఒప్పుకోలేని పరిస్థితిలో పడిపోయింది. ఫలితంగా, గత నాలుగేళ్లుగా కేవలం ఈ రెండు సినిమాలకే పరిమితమైంది.

ఈ ఏడాది 'వీరమల్లు, రాజా సాబ్' రెండూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలలో నిధికి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందట. దీంతో ఇప్పుడో ఐటెం సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నిధి.

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న 'జాట్'లో నిధి స్పెషల్ సాంగ్ చేయనుందనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇప్పటికే 'జాట్'లో స్పెషల్ నంబర్ కి నిధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఈ వారంలోనే ఆ పాటను చిత్రీకరించనున్నారు తెలుస్తోంది. ఏప్రిల్ 10న 'జాట్' రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News