మాధవన్ రొమాంటిక్ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది !
ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేఖ్ జోడీగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ "ఆప్ జైసా కోయి".;
ఇప్పటివరకు సినీ ప్రియులకు, ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందిస్తూ ముందుకు సాగుతోంది నెట్ ఫ్లిక్స్. ప్రేమకథలు, వినోదభరితమైన హాస్య చిత్రాలతో స్ట్రీమింగ్ దిగ్గజం కొత్త సినిమాల జాబితాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ జాబితాలో ఒక ముఖ్యమైన సినిమా.. ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేఖ్ జోడీగా నటిస్తున్న "ఆప్ జైసా కోయి". ఇది మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో మాధవన్, ఫాతిమా మధ్య ఆకర్షణీయమైన కెమిస్ట్రీని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఆప్ జైసా కోయి" టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ప్రారంభంలో మాధవన్ ఒక టాక్సీ నుండి బయటికి వచ్చి ఓ భవనానికి చేరుకుంటాడు. అక్కడ "మిస్ బోస్" గురించి అడుగుతాడు. ఈ పాత్రను "దంగల్" నటి ఫాతిమా సనా షేఖ్ పోషిస్తోంది. నేపథ్య సంగీతం ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ టీజర్‌లో మాధవన్, ఫాతిమా ఇద్దరూ ఒక సినిమా హాలులో కూర్చొని సినిమా చూస్తుంటారు. ఆ సమయంలో ఫాతిమా, "క్యూట్ గాళ్, నర్డీ బాయ్. బన్ సక్తీ హై ఏక్ రామ్-కామ్" అని చెప్పడం హైలైట్‌గా నిలుస్తుంది.
ఆప్ జైసా కోయి" మూవీ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమన్ మిశ్రా సంయుక్తంగా ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాధవన్, ఫాతిమా ఇద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. ఇది ఓ క్లాసిక్ ప్రేమకథ అవుతుందని జనం అభిప్రాయ పడుతున్నారు.