షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీపై తాజా అప్డేట్ !

Update: 2025-03-08 03:35 GMT

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్’ చిత్రానికి సంబంధించి షూటింగ్ షెడ్యూల్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, షూటింగ్ ఆలస్యమైందని వచ్చిన వార్తలను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఖండించాడు.

‘‘కింగ్’ సినిమా షూటింగ్ మే 2025లోనే ప్రారంభమవుతోంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. షారుక్ ఖాన్, నేను నిర్ణయించుకున్న సమయానికి ఏ మార్పులూ లేవు’’ అని తెలిపారు. అయితే ‘కింగ్’ సినిమాకి సంబంధించిన కథాంశంపై ఇప్పటివరకు ఎక్కువ అప్టేట్స్ రాలేదు.

అయితే.. తాజా సమాచారం ప్రకారం, షారుక్, సుహానా ఈ సినిమాలో తండ్రీ కూతుళ్లుగా నటించడం లేదు. షారుక్ ఒక కిల్లర్ పాత్రలో కనిపించనుండగా, ఆయన రక్షించాల్సిన బాధితురాలిగా సుహానా నటిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. ‘కింగ్’ సినిమా సుమారు 30 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

Tags:    

Similar News