కృతిసనన్ పెళ్లి వార్తలు.. వీటిలో నిజమెంత?

Update: 2025-02-21 03:40 GMT

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతుందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమె లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియా‌తో ప్రేమలో ఉందని, ఇటీవల ఈ జోడీ ఢిల్లీలో కలిసి దర్శనమిచ్చిందని వార్తలు వచ్చాయి. గతేడాది క్రిస్మస్‌ను కూడా కబీర్‌తో కలిసి జరుపుకున్నట్లు సమాచారం. వీరు పలుమార్లు కలిసి బయట కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.




 అయితే.. కృతిసనన్ వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ బాలీవుడ్ మీడియా ఆమె పెళ్లి ఈ ఏడాదిలో జరగదని చెబుతోంది. కృతి 2025లో పూర్తిగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండబోతుందని.. పెళ్లికి సమయం ఉండదని తెలిపింది. నిజం చెప్పాలంటే.. కృతికి ఈ ఏడాది అసలు సమయం లేదు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంది. అక్కడ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తవగానే మరో సినిమాలోకి వెళ్ళిపోతారు. మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు.




 


కృతిసనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "తేరే ఇష్క్ మేన్" సినిమా ఆనంద్ ఎల్ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ముక్తి పాత్రలో కనిపించ బోతున్న కృతి లుక్‌ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తోన్న నాలుగో బాలీవుడ్ చిత్రమిది. మరి కృతి సనన్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News