రెండోసారి బాలీవుడ్ లోకి కీర్తి సురేశ్
రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కి ఛాన్స్ దక్కింది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో రూపొందే ఈ చిత్రాన్ని జూన్ 1, 2025 నుండి ముంబైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.;
'బేబీ జాన్' చిత్రంతో బాలీవుడ్‌లో తన తొలి చిత్రం చేసింది మహానటి కీర్తి సురేష్ . ఇప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులు సైన్ చేస్తూ అటు ప్రేక్షకులను, ఇటు చిత్రపరిశ్రమను ఆకట్టుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె బాలీవుడ్ స్టార్ హీరో రాజ్‌కుమార్ రావుతో కలిసి మరో చిత్రం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాల్లోకి వెళితే.. 'టోస్టర్' అనే సినిమాతో రాజ్‌కుమార్ రావ్, ఆయన భార్య పత్రలేఖ కలిసి నిర్మాతలుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇప్పుడు ఈ దంపతులు తమ రెండవ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో, కొత్త చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కి ఛాన్స్ దక్కింది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో రూపొందే ఈ చిత్రాన్ని జూన్ 1, 2025 నుండి ముంబైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్‌కుమార్ రావ్, కీర్తి సురేష్ లాంటి శక్తివంతమైన నటులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.