కీర్తి సురేష్ కు అదిరిపోయే ఆఫర్ !

కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సరసన ఓ సినిమాకి సైన్ చేయనున్నట్లు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.;

By :  K R K
Update: 2025-03-26 00:23 GMT

మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నా.. ఆమె స్టార్ పవర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 2024లో విడుదలైన ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'బేబీ జాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఆమెకు బాలీవుడ్ నుంచి వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు, ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశమున్న మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సరసన ఓ సినిమాకి సైన్ చేయనున్నట్లు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి రణబీర్ కపూర్ తన పలు భారీ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా, బాలీవుడ్‌లో ఈ స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వస్తుందనే ఉత్సాహంలో కీర్తి సురేష్ ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, కీర్తి సురేష్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన 'అక్క' అనే హిందీ వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్‌కు రానుంది.

Tags:    

Similar News