ఇద్దరూ మళ్ళీ కెమేరాలకు చిక్కారు !

బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో ఆమెకు పెట్టిన ఫన్నీ అండ్ క్యూట్ బర్త్‌డే విషెస్. ఈ పోస్ట్‌తో వీరిద్దరి మధ్య రూమర్డ్ రిలేషన్‌షిప్ గురించిన గుసగుసలు మళ్లీ ఫుల్ జోరుగా స్టార్ట్ అయ్యాయి.;

By :  K R K
Update: 2025-07-04 00:42 GMT

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇటీవల తన బర్త్‌డేని సూపర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. అయితే, అసలు టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటంటే.. బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో ఆమెకు పెట్టిన ఫన్నీ అండ్ క్యూట్ బర్త్‌డే విషెస్. ఈ పోస్ట్‌తో వీరిద్దరి మధ్య రూమర్డ్ రిలేషన్‌షిప్ గురించిన గుసగుసలు మళ్లీ ఫుల్ జోరుగా స్టార్ట్ అయ్యాయి. అంతే కాదు, ముంబైలోని ఓ ట్రెండీ కేఫ్ దగ్గర జరిగిన ఓ సీన్‌తో.. ఈ రూమర్స్‌కి మరింత మసాలా యాడైంది.

శ్రీలీల, కార్తీక్ ఇద్దరూ ఆ కేఫ్ నుంచి విడివిడిగా బయటకు వస్తుంటే పాపరాజీ కెమెరాలు వాళ్లని క్యాచ్ చేశాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. నెటిజన్స్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఈ వీడియోలని డీకోడ్ చేస్తూ, "ఇద్దరి మధ్య ఏదో ఉంది" అంటూ స్పెక్యులేషన్స్‌లో మునిగిపోయారు. కానీ, ఈ ఇద్దరూ మాత్రం ఈ రూమర్స్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు.

ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో వీరిద్దరూ కలిసి ఓ సూపర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ బసు రూపొందిస్తున్న ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో శ్రీలీల, కార్తీక్ జోడీగా కనిపించబోతున్నారు. ఈ మూవీలో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. ఇక శ్రీలీల సోలోగా నటిస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ ‘జూనియర్’ గురించి కూడా బజ్ బాగానే ఉంది. ఈ సినిమా జులై 18 న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో శ్రీలీల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News