గాంగ్టక్ లో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల !
వైరల్ వీడియోల్లో కార్తిక్ ఆర్యన్ గంభీరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక క్లిప్‌లో కార్తిక్, శ్రీలీల ఇద్దరూ గిటార్ పట్టుకుని స్టేజ్ మీద కనిపిస్తారు. కార్తిక్ ప్రేక్షకుల మధ్య స్టేజ్ పై పాట పాడుతున్నట్లుగా నటించగా.. వెనుక అనురాగ్ బసు డైరెక్షన్ ఇస్తున్నారు.;
ఇంటర్నెట్‌లో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల కలిసి నటిస్తున్న ఒక రొమాంటిక్ చిత్రానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి తొలుత ‘ఆశికీ’ ఫ్రాంచైజీ లో భాగమని అనుకున్నారు కానీ, ఇది నిజంగా ‘ఆశికీ 3’ నా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సిక్కింలోని గాంగ్టక్ లో జరుగుతోంది.
వైరల్ వీడియోల్లో కార్తిక్ ఆర్యన్ గంభీరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక క్లిప్‌లో కార్తిక్, శ్రీలీల ఇద్దరూ గిటార్ పట్టుకుని స్టేజ్ మీద కనిపిస్తారు. కార్తిక్ ప్రేక్షకుల మధ్య స్టేజ్ పై పాట పాడుతున్నట్లుగా నటించగా.. వెనుక అనురాగ్ బసు డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ పాట "తూ మేరీ జిందగీ హై" అనే ఆశికీ (1990) లోని క్లాసిక్ సాంగ్‌కు రీమేక్ అనేది ప్రత్యేక ఆకర్షణ. మరో వీడియోలో కార్తిక్ స్టేజ్ పై కోపంగా మారి, ఒక వ్యక్తిని గిటార్ తో కొట్టి స్టేజ్ నుండి తన్నేస్తాడు, ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది.
ఈ వీడియోలు చూసిన జనాలు కార్తిక్ లుక్ పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయనను "రాక్ స్టార్ + కబీర్ సింగ్ మిక్స్", మరికొందరు రణబీర్ కపూర్ "యానిమల్" లుక్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక కొందరు సరదాగా "ఇప్పటికే సినిమా సగం చూసేసాం" అని సెటైర్లు వేస్తున్నారు. ఇంకా ఈ సినిమా గురించి అధికారికంగా ఎక్కువ వివరాలు వెల్లడించలేదు. కానీ, ఇది ఆశికీ ఫ్రాంచైజీ స్టైల్ లో ప్రేమకథతో సాగుతుందని ఊహిస్తున్నారు.
1990లో వచ్చిన తొలి ‘ఆశికీ’ చిత్రం, ఆ తర్వాత వచ్చిన భాగం భారీ విజయం సాధించాయి. అందుకే ఈ కొత్త సినిమా గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మధురమైన ప్రేమకథ, అద్భుతమైన సంగీతం ఉంటాయని భావిస్తున్నారు. కానీ ఇది నిజంగా "ఆశికీ 3" అనే టైటిల్ తో వస్తుందా, లేదా వేరే కథాంశమా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.