కంగనా రనౌత్, మాధవన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ పూర్తి !
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన తాజా థ్రిల్లర్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ.. చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా ఆమె దాదాపు దశాబ్దం తర్వాత.. 2015లో విడుదలైన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తర్వాత.. తమిళ హీరో మాధవన్‌తో మరో సారి స్ర్కీన్ షేర్ చేసుకోనుంది.
ఈ పాన్ ఇండియా సైకాలజికల్ థ్రిల్లర్‌ను ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. 2023లో కంగనా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా... కంగనా ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ చిత్రంలో ఆమె గులాబీ చీరలో కనిపించింది. దర్శకుడు విజయ్‌తో పాటు ఇతర బృందసభ్యులతో కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోజిచ్చింది. ఫోటోకు క్యాప్షన్‌గా.. “నేడు నా రాబోయే థ్రిల్లర్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాను. నా ఫేవరెట్‌లతో కలిసిన నాకిది అద్భుతమైన అనుభవం. థియేటర్లలో కలుద్దాం.” అంటూ రాసింది.
ఆర్. మాధవన్ కూడా కంగనా పోస్టును రీ-షేర్ చేస్తూ, షూటింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు. “మళ్లీ ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను! అద్భుతమైన టీం, అందమైన యూనిట్. కంగనా.. మామూలుగా కాకుండా రాక్ చేయండి!” అని రాశాడు. ఈ చిత్ర షూటింగ్ 2023లో చెన్నైలో ప్రారంభమైందని.. ఆ సమయంలో కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెల్లడించింది. “నేడు చెన్నైలో మా కొత్త చిత్రానికి ముహూర్తం జరిగింది. ఇది ఓ సైకాలజికల్ థ్రిల్లర్. మరిన్ని వివరాలు త్వరలో. మీరు అందరూ మాకు ఆశీర్వాదాలు అందించాలి.” అని పేర్కొంది.
ఈ చిత్రం కంగనా, మాధవన్‌కు దశాబ్దం తర్వాత రీయూనియన్ లాంటిదైతే, దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ఆమె రెండోసారి కలిసి పనిచేస్తుంది. వీరిద్దరి కలయికలో ‘తలైవి’ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.