మండోదరిగా కాజల్ అగర్వాల్ ?
బాలీవుడ్ క్రేజీ మైథలాజికల్ ప్రాజెక్ట్ "రామాయణం"లో ఆమె మందోదరి పాత్రకు ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.;
టాలీవుడ్ అందాల హీరోయిన్ .. కాజల్ అగర్వాల్ ఎర్లియర్ గా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో “సికందర్” చిత్రంలో కనిపించింది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “కన్నప్ప” లో కాజల్ పార్వతీదేవి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నారు.
ఇప్పటికే రెండు పాన్‌ఇండియా ప్రాజెక్టుల్లో భాగమవుతున్న కాజల్ తాజాగా మరో భారీ పాత్రను దక్కించుకుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ క్రేజీ మైథలాజికల్ ప్రాజెక్ట్ "రామాయణం"లో ఆమె మందోదరి పాత్రకు ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటించనుండగా, యాష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ రావణుడి భార్య మందోదరి పాత్రలో కనిపించనుంది. ఇది కాజల్‌కు ఎంతో కీలకమైన పాత్ర. రామాయణం వంటి ఇతిహాస కథలో మండోదరి పాత్ర ప్రాధాన్యతతో కూడినది. ఈ పాత్ర ద్వారా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిని చేరనుందని భావిస్తున్నారు.
అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ "రామాయణం" సినిమా ఐదు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం కాజల్‌కు ప్రెస్టీజియస్ అవకాశంగా నిలవనుంది.