మెగాఫోన్ పట్టబోతున్న చందమామ?
డైరెక్టర్‌గా మారి ఓ హిందీ సినిమాను తెరకెక్కించాలనే ఆమె ప్లాన్ నిజంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్తుందా లేక రిస్కీ గేమ్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.;
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త టర్న్ తీసుకోబోతోందని టాక్ బాగా వినిపిస్తోంది. రూమర్స్ ఏంటంటే, ఆమె ఓ హిందీ కమర్షియల్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేయబోతోంది. అది కూడా స్వయంగా లీడ్ రోల్లో కూడా కనిపించబోతోందని టాక్. ఈ బోల్డ్ మూవ్ ఇండస్ట్రీలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది, ఇది ఆమె కెరీర్లో ఓ గేమ్‌ఛేంజర్ అవుతుందా అని చర్చలు జరుగుతున్నాయి.
‘మగధీర’, ‘చందమామ’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో సౌత్ సినిమా స్టార్‌గా ఎదిగిన కాజల్, తన గ్లామర్, టాలెంట్‌తో కోట్లాది ఫ్యాన్స్ హృదయాల్లో చోటు సంపాదించింది. కానీ, 2020లో బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో పెళ్లి, ఆ తర్వాత 2022లో కొడుకు నీల్ జననం తర్వాత ఆమె సినిమా జర్నీ కాస్త స్లో అయింది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రస్తుతం ‘ఇండియన్ 3’, ‘కన్నప్ప’ లాంటి ప్రాజెక్టులు తప్ప, ఆమె డైరీలో పెద్దగా సినిమా ఆఫర్లు కనిపించడం లేదు.
ఈ సిచుయేషన్‌లో కాజల్ తన ఫోకస్‌ని సినిమాల నుంచి బ్రాండ్ ఎండార్స్మెంట్స్, బిజినెస్ వెంచర్స్ వైపు మళ్లించింది. ఆమె బ్రాండ్ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా ఉంటూ, సోషల్ మీడియాలోనూ స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపిస్తోంది. కానీ, ఇప్పుడు డైరెక్టర్‌గా మారి ఓ హిందీ సినిమాను తెరకెక్కించాలనే ఆమె ప్లాన్ నిజంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్తుందా లేక రిస్కీ గేమ్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.
ఈ హిందీ ఫిల్మ్ గురించి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రాకపోయినా.. కాజల్ ఈ ప్రాజెక్ట్‌తో సీరియస్‌గా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఒకవైపు నటిగా, మరోవైపు డైరెక్టర్‌గా రెండు పాత్రలు పోషించడం అంటే ఆమె ఫుల్ ఎనర్జీతో రీఎంట్రీ ఇవ్వబోతోందని అర్ధం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.