వాయిదా పడ్డ జాన్ అబ్రహం ‘ది డిప్లొమాట్’ మూవీ
జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక థ్రిల్లర్ ‘ది డిప్లొమాట్’. హోలీ సందర్భంగా మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. శివమ్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవిత ఘటనల నుండి ప్రేరణ పొందింది. కూటమి, ధైర్యం, మేధస్సుతో నడిచే ఈ రాజకీయ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. నిజానికి ఈ సినిమా మార్చి 7న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా మేకర్స్ దాన్ని మార్చి 14కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ చిత్రంలో జాన్ అబ్రహాం పాటు సాదియా ఖతీబ్, షారిబ్ హష్మి, రేవతి, కుముద్ మిశ్రా వంటి ముఖ్య తారాగణం కనిపించనున్నారు. యుద్ధానికి బదులుగా చాకచక్యం, దౌత్యతత్త్వం, నెగోషియేషన్‌ను నాయకుడు ఆయుధాలుగా ఉపయోగించుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. జాన్ అబ్రహాం ఈ చిత్రంలో భారతీయ రియల్-లైఫ్ డిప్లొమాట్ జె.పి. సింగ్ పాత్రలో కనిపించనున్నాడు.
‘డాటర్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో ఓ యువతిని చెరలోనుండి రక్షించేందుకు అతను చేపట్టిన హై-స్టేక్స్ మిషన్ ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ రోల్స్‌లో ఎక్కువగా కనిపించిన జాన్ అబ్రహాం, ఈ చిత్రంతో తన సరికొత్త నటనాశైలిని ప్రదర్శించనున్నాడు. స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్, నెగోషియేషన్ వంటి అంశాలను నమ్ముకుని నడిచే పాత్రలో ఆయన నటించడం విశేషం. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ , జాన్ అబ్రహాం, విపుల్ డి. షా, అశ్విన్ వర్దే, రాజేష్ బహల్ , సమీర్ దిక్షిత్, జతీష్ వర్మ, రాకేష్ డాంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.