మళ్లీ జాన్ అబ్రహం– తమన్నా జోడీ !
జాన్ అబ్రహం, తమన్నా జోడీ మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ముంబయి మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.;
గత ఏడాది 'వేదా' చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జాన్ అబ్రహం, తమన్నా జోడీ మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ముంబయి మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ బయోపిక్‌లో కథానాయిక పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారని టాక్. రాకేశ్ మారియా జీవితంలో కీలకస్థానాన్ని ఆక్రమించిన ఆయన భార్య ప్రీతి పాత్రను తమన్నా చేయనుంది. భర్తను నిస్వార్థంగా ప్రోత్సహిస్తూ.. ముంబయి నగరాన్ని ఉగ్రవాద ముప్పు నుంచి రక్షించడంలో రాకేశ్‌కు అండగా నిలిచిన ప్రీతి పాత్ర సినిమాకు కీలక ఆకర్షణగా నిలవనుంది.
ఈ పాత్రను పోషించనున్నందుకు తమన్నా ఎంతో ఆనందంగా ఉందని చిత్రబృందానికి చెందిన సన్నిహితులు తెలిపారు. గతంలో తమ కలయికను అభిమానులు ఎంతగానో ఆదరించిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా తమ్మూకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.