బాలీవుడ్ లో భలే కాంబో !

తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్ లో ... రోహిత్ శెట్టితో కలిసి పనిచేయ బోతున్నారా? అనే ప్రశ్నకు జాన్ అబ్రహం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.;

By :  K R K
Update: 2025-03-22 03:54 GMT

బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కాంబో ఖరారైంది. హిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, స్టైలిష్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తాజాగా జాన్ అబ్రహం స్వయంగా ఈ వార్తను ధృవీకరించడమే కాకుండా... తమ ఇద్దరి కాంబినేషన్ ఒక అదిరిపోయే ప్రాజెక్ట్ అవుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్ లో ... రోహిత్ శెట్టితో కలిసి పనిచేయ బోతున్నారా? అనే ప్రశ్నకు జాన్ అబ్రహం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. “మేమిద్దరం కలిసి పని చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. ఆ విషయంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు, నిజాయితీగా చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నిజంగా ఇది జరిగితే చాలా బావుంటుంది,” అని అన్నారు.

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఇందులో దాగున్నాయని తెలిపారు. “కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఆ కథనే అసలైన ఆకర్షణగా చెప్పాలి. ఇది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంది,” అని జాన్ చెప్పారు.

ప్రస్తుతం జాన్ అబ్రహం తన తాజా సినిమా ‘ది డిప్లొమాట్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. శివం నాయర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో సాదియా ఖతీబ్, రేవతి, కుముద్ మిశ్రా, షారిబ్ హష్మీ, జగ్జీత్ సందు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 

Tags:    

Similar News