కెరీర్ కే పూర్తిగా అంకితమైన జాన్వీ కపూర్ !
ప్రస్తుతం "RC 16" షూటింగ్‌లో నిమగ్నమైన ఆమె, "పరమ సుందరి" వంటి ప్రాజెక్ట్‌లను కూడా చేతిలో పెట్టుకుంది.;
జాన్వి కపూర్ వివాహం గురించి ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. తన ప్రియుడు శిఖర్ పహారియా తో ఆమె తరచుగా కనిపించడం, గతంలో తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. అయితే, జాన్వికి సమీపవర్గాల సమాచారం ప్రకారం.. ఆమె పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి సారించిందట.
ప్రస్తుతం "RC 16" షూటింగ్‌లో నిమగ్నమైన ఆమె, "పరమ సుందరి" వంటి ప్రాజెక్ట్‌లను కూడా చేతిలో పెట్టుకుంది. మరోసారి పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆమె చలాకీగా స్పందిస్తూ, "నా సినిమాల గురించే అడగండి.. ఇప్పుడు నేను కన్ఫామ్ చేసే ఏకైక డేట్స్ అవే!" అని నవ్వుతూ చెప్పింది.
ప్రస్తుతం జాన్వి కపూర్ దక్షిణ భారత చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరిగా నిలిచింది. "దేవర" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి "ఆర్సీ 16"లో నటిస్తోంది. అంతేకాక, అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి కూడా ఆమెను పరిశీలిస్తున్నారని సమాచారం.