కేరళ అందాల్ని ఆస్వాదిస్తున్న ‘పరమ్ సుందరి’

సరిగ్గా తీర్చిదిద్దిన బొట్టు, మెత్తని గులాబీ రంగు పువ్వుల చెవిపోగులు, సహజమైన మెరుపుతో ఆమె రూపం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది.;

By :  K R K
Update: 2025-02-10 01:32 GMT

ప్రస్తుతం కేరళలోని అందమైన ప్రదేశాల్లో ‘పరమ సుందరి’ చిత్రీకరణలో పాల్గొంటోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తన తాజా లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. నాజూకైన క్రీమ్ కలర్ డిజైన్ శారీలో ఆమె మెరిసిపోతోంది. శాంతమైన నదీ విహారాన్ని ఆస్వాదిస్తూనే.. సరిగ్గా తీర్చిదిద్దిన బొట్టు, మెత్తని గులాబీ రంగు పువ్వుల చెవిపోగులు, సహజమైన మెరుపుతో ఆమె రూపం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

‘పరమ్ సుందరి’ చిత్రంలో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారి కలిసి నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా.. కేరళ బ్యాక్ వాటర్స్ నేపథ్యంతో రూపొందిన విభిన్నమైన ప్రేమకథగా రూపొందుతోంది. కొత్త జంట, వినూత్న కథాకథనాలతో ‘పరమ సుందరి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘దస్వి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తుషార్ జలోటా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అందమైన విజువల్స్, సాంస్కృతిక సౌందర్యాన్ని సమ్మిళితంగా చూపించబోయే ఈ సినిమా రొమాన్స్, భావోద్వేగాలతో అద్భుతంగా తెరకెక్కించారు. 2025 జులై 25న థియేటర్లలో విడుదల కానున్న ‘పరమ సుందరి’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది. జాన్వీ ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్, సిద్ధార్థ్ మల్హోత్రా మ్యాజిక్‌తో ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం!

Tags:    

Similar News