హృతిక్ గాయం.. డ్యాన్స్ ఫేస్ ఆఫ్ కు ఆలస్యం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'వార్ 2'. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్, ముఖ్యంగా హృతిక్-ఎన్టీఆర్ మధ్య ఫైట్స్, డ్యాన్స్ ఫేస్ ఆఫ్స్ వంటి హైలైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
లేటెస్ట్ గా ఈ మూవీలోని తారక్-హృతిక్ కలిసి సందడి చేసే పాట షూటింగ్ జరుగుతుంది. అయితే రిహార్సల్స్ సమయంలో హృతిక్ కాలికి గాయమైందట. దీంతో హృతిక్ నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ సూచించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. 'వార్ 2'లో హృతిక్-ఎన్టీఆర్ ల మధ్య వచ్చే డ్యాన్స్, ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. అయితే హృతిక్ కి గాయమైనప్పటికీ, సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుందట టీమ్.