కడుపుబ్బ నవ్వించబోతున్న 5వ భాగం !

Update: 2025-02-25 03:32 GMT

ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. ఈ సినిమా ఇప్పటి నుంచే భారీ అంచనాలను నెలకొల్పింది. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా తాజాగా మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ‘హౌస్‌ఫుల్ 5’ సినిమా హాస్యానికి తోడు మర్డర్ మిస్టరీ థ్రిల్‌ని కూడా జోడించనుంది.

ఓ క్రూయిజ్ షిప్‌లో హత్య జరుగుతుంది. అంతా అనుమాని తులుగా మారతారు. ఇందులో ఇద్దరు ప్రముఖ నటులు పోలీసులుగా కనిపించ బోతున్నారు. "ఈ ఇద్దరు పోలీసులు హంతకుడు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నంలో జరిగే ఇన్సిడెంట్స్ హాస్యాన్ని పుట్టిస్తాయి. అదే సమయంలో ఆసక్తికరంగానూ ఉంటుంది. ఈ చిత్రంలో ఇంకా .. రితేష్ దేశ్‌ముఖ్, సోనం బజ్వా, నర్గిస్ ఫఖ్రీ, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రంగద సింగ్, సౌందర్య శర్మ, డినో మోరియా, శ్రేయాస్ తల్పాడే, నికితిన్ ధీర్, జానీ లీవర్, చంకీ పాండే, రంజీత్, ఆకాష్‌దీప్ సబీర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

2024 డిసెంబర్‌లో సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. "హౌస్‌ఫుల్ 5 షూటింగ్ పూర్తయింది. నవ్వులు, కష్టాలు, మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణం. 2025 జూన్ 6న మీ దగ్గర థియేటర్లలో నవ్వులతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడానికి వస్తున్నాం..” అంటూ చిత్రబృందం షేర్ చేసింది. ఇక ‘హౌస్‌ఫుల్ 5’ ట్రైలర్ 2025 మార్చిలో విడుదల కానుంది. అదీ కాకుండా, సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటిస్తున్న యాక్షన్ చిత్రం సికందర్ సినిమాతో కలిసి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. తరుణ్ మన్స్‌ఖానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News