హై-వోల్టేజ్ యాక్షన్.. ‘సికందర్’ టీజర్ అదుర్స్!
By : Surendra Nalamati
Update: 2025-02-27 11:16 GMT
ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్ నుంచి సినిమా రావడం ఆనవాయితీ. ఈ ఏఢాది ఈద్ స్పెషల్ గా ‘సికందర్‘తో వస్తున్నాడు సల్లూ భాయ్. ఈ మూవీలో సల్మాన్ కి జోడీగా రష్మిక నటిస్తుంది. తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజయ్యింది. 1 నిమిషం 21 సెకన్ల నిడివితో రిలీజైన ఈ టీజర్ ప్రేక్షకులకు పక్కా విజువల్ ఫీస్ట్ అందించేలా ఉంది.
టీజర్‌లో సల్మాన్ పవర్‌ఫుల్ లుక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హ్యాండ్-టు-హ్యాండ్ ఫైటింగ్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈద్ కానుకగా మార్చి 30 లేదా 31న థియేటర్లలో ‘సికందర్‘ థియేటర్లలోకి రానుంది