బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్న గోవిందా !
గోవిందా తన కమ్‌బ్యాక్‌ను గ్రాండ్‌గా ప్రకటించాడు. కొత్త సినిమా ‘దునియాదారి’తో మళ్లీ వెండితెరను షేక్ చేయడానికి సిద్ధమవు తున్నాడు.;
బాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ గోవిందా తన కమ్‌బ్యాక్‌ను గ్రాండ్‌గా ప్రకటించాడు. కొత్త సినిమా ‘దునియాదారి’తో మళ్లీ వెండితెరను షేక్ చేయడానికి సిద్ధమవు తున్నాడు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక కూల్ అప్డేట్ షేర్ చేశాడు గోవిందా. ఓ వీడియోలో అతను తన సిగ్నేచర్ డాన్స్ స్టైల్లో స్టెప్పులేస్తూ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ఆ వీడియోలో ఉన్న ట్రాక్ ఏంటో ఇంకా రివీల్ కాలేదు, కానీ ఇది సినిమాలో ఓ కీలక సీన్ కోసం రిహార్సల్ అని తెలుస్తోంది. వీడియోకు క్యాప్షన్‌గా, “నా రాబోయే మూవీ ‘దునియాదారి’ కోసం రిహార్సల్లో ఉన్నా” అని రాసుకొచ్చాడు.
సినిమా డీటెయిల్స్ ఇంకా సీక్రెట్‌గా ఉన్నాయి, కానీ ఫ్యాన్స్ మాత్రం గోవిందా తిరిగి సినిమాల్లో సందడి చేయడానికి సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. గోవిందా డాన్స్ మూమెంట్స్ చూస్తే ఈ మూవీలో అతని ఎనర్జీ, స్టైల్ ఫుల్‌గా ఉండబోతు న్నాయని అర్థమవుతోంది. అతని డాన్స్ అంటేనే 90s నాటి ఆ వైబ్, అదే ఎనర్జీ, అదే స్వాగ్! ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తూ, “గోవిందా బ్యాక్ ఇన్ యాక్షన్!” అంటూ కామెంట్స్ పేల్చేస్తున్నారు.
గోవిందా చివరిసారిగా 2019లో ‘రంగీలా రాజా’ సినిమాలో కనిపించాడు. ఆ సినిమాలో శక్తి కపూర్, దిగంగన సూర్యవంశీ, ప్రేమ్ చోప్రా వంటి స్టార్స్ కూడా నటించారు. కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘దునియాదారి’తో గోవిందా మళ్లీ తన మాయ చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని డాన్స్, కామెడీ, ఎనర్జీ మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో గోవిందా తన గోల్డెన్ డేస్‌ను రిపీట్ చేస్తాడా? వెయిట్ అండ్ వాచ్.