‘జాన్ విక్’ అభిమానులకు శుభవార్త!
లయన్స్‌గేట్ సంస్థ ఇప్పుడు ‘జాన్ విక్: చాప్టర్ 5’ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా హై యాక్టేన్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రత్యేకంగా.. లయన్స్‌గేట్ గ్లోబల్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పీరియెన్సెస్ అధినేత జెన్నిఫర్ బ్రౌన్ లాస్ వేగాస్‌లో జరిగిన జాన్ విక్ ఎక్స్‌పీరియెన్స్ ప్రివ్యూలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
"మేము ఐదవ ‘జాన్ విక్’ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాం. జాన్ విక్ చనిపోయి ఉండొచ్చు. మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’.. అని ఆమె పేర్కొన్నారు. అయితే.. ‘జాన్ విక్: చాప్టర్ 4’ చివర్లో జాన్ విక్ మరణించినట్టు చూపించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఈ తాజా ప్రకటన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
మరోవైపు.. లయన్స్‌గేట్ స్టూడియో ఇప్పటికే ‘ది క్రో, బోర్డర్‌లాండ్స్, మేగాలోపొలిస్, నెవర్ లెట్ గో, ది మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మన్‌లీ వార్‌ఫేర్’ వంటి ప్రాజెక్టులతో నిరాశను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో.. ‘జాన్ విక్ 5’ కోసం కీనూ రీవ్స్‌ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు స్టూడియో పెద్ద మొత్తంలో ఆఫర్ ఇవ్వడం అనివార్యం. ‘జాన్ విక్’ ఫ్రాంచైజీ మరోసారి సంచలనాన్ని సృష్టిస్తుందని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు!