‘మర్దానీ 3’ మూవీ రిలీజయ్యేది అప్పుడే !

యష్ రాజ్ ఫిల్మ్స్ ‘మర్దానీ 3’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 27, 2026... హోళీ ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ సినిమా విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-04-21 06:18 GMT

బాలీవుడ్ లో 10 ఏళ్ళుగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంటూ... అత్యధిక గుర్తింపు పొందిన సోలో ఫిమేల్ లీడ్ ఫ్రాంచైజీగా నిలిచింది.. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘మర్దానీ’ సిరీస్. ఈ సిరీస్ లో ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఇందులో రాణీ ముఖర్జీ మళ్ళీ ధైర్యవంతురాలైన పోలీస్ అధికారి శివాని శివాజీ రాయ్ పాత్రలో అదరగొట్టబోతోంది.

తాజాగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘మర్దానీ 3’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 27, 2026... హోళీ ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ సినిమా విడుదల కానుంది. ‘మర్దానీ 3’ కథాంశం.. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాన్ని సూచిస్తుంది. సోషల్ మీడియా ద్వారా విడుదలైన రాణీ ముఖర్జీ ఫస్ట్ లుక్ మాత్రం గట్టి ప్రభావాన్ని చూపించింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అభిరాజ్ మినావాలా. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై కొన్ని ముఖ్యమైన షెడ్యూల్లు పూర్తయ్యాయి. ఇటీవల, ముంబయిలోని విలేపార్లేలో గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరిపిన తర్వాత, ప్రస్తుతం యష్ రాజ్ స్టూడియోస్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్సులు కథలో ఎంతో కీలకమైనవి కావడం విశేషం.

Tags:    

Similar News