వంద కోట్ల క్లబ్‌లో 'జాట్'!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయింది.;

By :  S D R
Update: 2025-04-22 00:45 GMT

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ప్రత్యేకించి నార్త్ బెల్ట్ ప్రాంతాల్లో ఈ సినిమాకు అత్యద్భుత స్పందన లభిస్తోంది.

'జాట్' సన్నీ డియోల్ ఫ్యాన్స్‌కి ఇది పండుగలా మారింది. ఈ చిత్రం సన్నీ కెరీర్‌లో బెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచిందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ‘జాట్’ దూకుడు ఆగడం లేదు. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ, ఇటీవలే రూ.102.13 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

'గదర్ 2' తర్వాత సన్నీ డియోల్ కిట్టీలో చేరిన మరో వంద కోట్ల సినిమా 'జాట్'. టాలీవుడ్ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా 'జాట్' చిత్రాన్ని నిర్మించాయి. 'జాట్' ఘన విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'జాట్ 2'ని తీసుకురాబోతున్నారు.

Tags:    

Similar News