కంగనా సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ !
“ఎమర్జెన్సీ” భారత్‌లో రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది డీసెంట్ నెంబర్.;
రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన కంగనా రనౌత్ ప్రథానపాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాకి ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అయితే, ఆ తర్వాత ఈ చిత్రం గ్రాడ్యువల్ గా ఊపందుకుంది. మొదటి వీకెండ్ ముగిసే నాటికి.. “ఎమర్జెన్సీ” భారత్‌లో రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది డీసెంట్ నెంబర్.
భారత చరిత్రలో ఒక కీలకమైన కాలంలో ఇందిరా గాంధీ జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఈ చిత్రం ప్రాధాన్యం పొందింది. సినిమా కంటెంట్ పై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి కానీ, కంగనా రనౌత్ అద్భుతమైన నటన ప్రశంసలు పొందింది.
కంగనా రనౌత్ కొంతకాలంగా తన చిత్రాలతో పెద్ద సంఖ్యలో వసూళ్లను సాధించడంలో కష్టపడుతోంది. అయితే, ఇటీవల ఆమె నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రానికి మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ నమోదయ్యాయి.