బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోన్న ‘చావా’
విక్కీ కౌశల్ నటించిన చారిత్రక చిత్రం 'ఛావా' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. రెండో వారాంతానికి రూ. 107.5 కోట్లతో ఇటీవల కాలంలో హిందీ సినిమాల్లో రెండో అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. 'పుష్ప 2' హిందీ వెర్షన్ రూ. 127 కోట్లతో సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ లో మొదటి స్థానంలో ఉండగా, 'ఛావా' రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ‘చావా’ చిత్రం బాలీవుడ్ లోని ఇతర పెద్ద హిట్ చిత్రాల్ని మించి పోయింది.
'స్త్రీ 2' – రూ. 92.9 కోట్లు
'గదర్ 2' – రూ. 90.47 కోట్లు
'యానిమల్' – రూ. 87.56 కోట్లు
'జవాన్' – రూ. 82.46 కోట్లు
'పఠాన్' – రూ. 63.5 కోట్లు
లక్ష్మణ్ ఉఠేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహారాష్ట్ర వీర యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కేవలం 10 రోజుల్లోనే 'ఛావా' రూ. 326.75 కోట్లు వసూలు చేసింది. మార్చి మొదటి వారానికి పెద్ద సినిమాల విడుదల లేనందున, ఈ చిత్రం భారతదేశంలో రూ. 400 కోట్ల మార్క్ దాటి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర అమెరికాలో 4 మిలియన్ డాలర్స్ (సుమారు రూ. 33 కోట్లు) వసూలు చేసింది.
"విక్కీ కౌశల్ గత సినిమాల్లో, 'సంజు', 'డుంకీ' తప్ప.. ఏ సినిమాకీ కూడా ఇంత భారీ ఓపెనింగ్స్ రాలేదు. కానీ 'ఛావా' మాత్రం తొలి రోజు రూ. 30 కోట్లను దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ప్రేమకథా చిత్రం కాకపోయినా, వాలెంటైన్ డే కారణంగా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే 'ఛావా' ఈ సంవత్సరంలోనే కాదు, బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలున్నట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.