దక్షిణాది భాషల్లోకి ఈ మరాఠీ చిత్రాన్ని రీమేక్ చేయనున్న బోనీ కపూర్

Update: 2025-02-23 05:10 GMT

2023లో విడుదలైన మరాఠీ చిత్రం ‘బాయిపన్ భరీ దేవ’ మరాఠీ సినీ పరిశ్రమకు గొప్ప ఊతమిచ్చింది. ఆరుగురు మహిళా నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి రోజునుంచే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కథాంశం, నటుల అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్, సహజత్వం, సంగీతం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాక, దీనికి విశ్వవ్యాప్త స్పందన ఉంది. అంటే, ఈ కథను ఇతర భాషల్లోకి రీమేక్ చేయడానికి పూర్తి అవకాశం ఉంది.





 


ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ విషయాన్ని ముందుగా గుర్తించి.. ఈ మరాఠీ బ్లాక్‌బస్టర్‌ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. బోనీ కపూర్ ‘బాయిపన్ భరీ దేవ’ సినిమాను చూసి ఎంతగానో ఆకర్షితుడయ్యారట. 2024లోనే ఆయన రీమేక్ హక్కులను పొందారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



 



ఈ రీమేక్ హక్కులకు బోనీ కపూర్ ఏకంగా రూ. 2 కోట్లు చెల్లించారు. ఎందుకంటే, ఈ కథలో ఉన్న బలం, దీని సూపర్ హిట్ స్థాయి ఆయనకు బాగా తెలుసు. కేదార్ శిండే దర్శకత్వంలో, జియో స్టూడియోస్ మరియు ఎంవీబీ మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, దీపా పరబ్, వందనా గుప్తే, సుచిత్రా బండేకర్, శిల్పా నవల్కర్, సుకన్య కులకర్ణి ముఖ్య పాత్రలు పోషించారు.


 



ఒకప్పుడు దగ్గరగా ఉన్న ఆరుగురు అక్కచెల్లెళ్లు, కాలక్రమంలో విభేదాల వల్ల దూరమవుతారు. అయితే, ‘మంగళ గౌర్’ అనే పోటీలో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడటంతో, వారు మళ్లీ కలుసుకుంటారు. ఆ సంఘటనలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేదే కథ. ఈ సినిమా రూ. 76.05 కోట్ల కలెక్షన్లతో మరాఠీ సినిమా చరిత్రలో ‘సైరాట్’ తర్వాత రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

Tags:    

Similar News