బాలీవుడ్ చిత్రం "మిసెస్" వివాదం... రాశీ ఖన్నా మద్దతు

Update: 2025-03-10 04:47 GMT

కొద్ది రోజుల క్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం "మిసెస్". ఈ మూవీ మహిళలను బాధల్లో మునిగినట్టుగానూ, అసహాయ స్థితిలో ఉన్నట్టుగానూ చూపిం చిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రేక్షకులు, విమర్శకులు పెద్దగా ఆదరించని ఈ చిత్రానికి ఇప్పుడు నటి రాశీ ఖన్నా మద్దతుగా నిలిచారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా గురించి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కొత్త చర్చకు దారి తీసింది.

సోషల్ మీడియాలో రాశీ ఖన్నా స్పందిస్తూ.. "ఈ చిత్రం ప్రతీ మహిళ జీవితం ఎలా ఉంటుందో చెప్పదు కానీ, కొంతమంది వాస్తవ పరిస్థితులను ప్రతిబింబి స్తుంది" అని పేర్కొంది. అలాగే, దర్శక, నిర్మాతల తపనను ప్రశంసిస్తూ, సాన్యా మల్హోత్రా నటన ఎంతో హృదయాన్ని కదిలించేలా, ప్రభావితం చేసేలా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఆమె మాటలు అభిమానులను రెండు వర్గాలుగా విభజించాయి. కొంత మంది ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం సినిమా కథనాన్ని విమర్శిస్తూనే ఉన్నారు.

ఇక రాశీ ఖన్నా ప్రస్తుతం "తెలుసు కదా" అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కథ, పాత్రల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించకపోయినా, రాశీ ఖన్నా ఇందులో కొత్తగా, ఆసక్తికరంగా కనిపించబోతున్నారన్న ఊహాగానాలు జరుగుతున్నాయి.

"మిసెస్" సినిమాకు ఆమె మద్దతు ఇచ్చిన విషయంపై వివాదం కొనసాగుతున్నా, రాశీ ఖన్నా తన కొత్త సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రజాభిప్రాయం మారుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ఆమె వెనకాడరు అన్నది మాత్రం మరోసారి రుజువైంది. అన్నట్టు ‘మిసెస్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రానికిది రీమేక్ వెర్షన్.

Tags:    

Similar News