‘కింగ్’ పట్టాలెక్కేది అప్పటి నుంచేనా?
సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో “మే 2025” అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది చూసిన వెంటనే అభిమానులు ఇది ‘కింగ్’ మూవీ గురించే అని ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు.;
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ "కింగ్". ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై కొన్ని అంచనాలు ఉండగానే, తాజాగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో “మే 2025” అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది చూసిన వెంటనే అభిమానులు ఇది ‘కింగ్’ మూవీ గురించే అని ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. ముంబైలో మే 2025 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఇది సంకేతమని భావిస్తున్నారు.
ఇంతకుముందు ఈ సినిమాను సుజాయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, 2024లో తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టర్‌గా నియమితులయ్యారని టాక్ . ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు, ఆయన బృందం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో రెక్కీ చేసి, అంతర్జాతీయ స్థాయి స్టంట్ డైరెక్టర్లతో వినూత్నమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసినట్లు సమాచారం. ఒక విశ్వసనీయ మూలం తెలిపిన ప్రకారం.. ఇది బాలీవుడ్ లో ఇప్పటివరకు రాసిన అత్యంత అద్భుతమైన యాక్షన్ స్క్రిప్ట్ అని చెప్పుకుంటున్నారు. షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కలిసి ప్రపంచవ్యాప్తంగా పలు లొకేషన్లలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇప్పటికే చాలా లొకేషన్లలో రెక్కీ పూర్తయింది."
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ శిష్యురాలిగా ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అలాగే ‘ముంజియా’ సినిమాతో గుర్తింపు పొందిన అభయ్ వర్మ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను సుజాయ్ ఘోష్, సిద్ధార్థ్ ఆనంద్, సురేశ్ నాయర్, సాగర్ పాండ్యా కలిసి రచించారు. డైలాగ్స్ కోసం అబ్బాస్ టైరేవాలా చేతులు కలిపారు. ప్రతీ పాత్రకూ స్క్రీన్‌ప్లేలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి నటుడికి తళుక్కుమనే అవకాశాలు ఉంటాయని సమాచారం.