‘రామాయణం’ ఇంట్రడక్షన్ గ్లింప్స్ వచ్చేసింది!

‘రామాయణం పార్ట్ 1’ అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటుందని ఈ వీడియో చెబుతోంది. ఈ వీడియో చివరిలో రాముడిగా రణబీర్ కపూర్ బాణం సంధించడం ఆకట్టుకుంటోంది.;

By :  K R K
Update: 2025-07-03 07:30 GMT

బాలీవుడ్ భారీ ఎపిక్ మూవీ ‘రామాయణం’ ఫస్ట్ లుక్ కోసం అభిమానుల ఎదురుచూపు ముగిసింది. నితేష్ తివారీ రూపొందించిన ఈ పౌరాణిక ఎపిక్‌ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. పాత్రల్ని విజువల్ గా పరిచయం చేయకుండా టెక్స్ట్ రూపంలో రివీల్ చేస్తూ ఈ వీడియోను తయారు చేశారు. ఈ పరిచయ వీడియో .. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శితమైంది.

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం పార్ట్ 1’ అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటుందని ఈ వీడియో చెబుతోంది. ఈ వీడియో చివరిలో రాముడిగా రణబీర్ కపూర్ బాణం సంధించడం ఆకట్టుకుంటోంది. కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ‘రామాయణం పార్ట్ 1’ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

2026 దీపావళికి ‘రామాయణం’ ఫస్ట్ పార్ట్ విడుదల కాబోతోంది. దీని తర్వాత.. రామాయణం టీమ్ 7 నిమిషాల నిడివితో విజువల్ షోరీల్‌ను ప్రదర్శించనుంది. ఇది 2026 దీపావళి సమయంలో థియేట్రికల్ రిలీజ్‌కు సమీపంలో విడుదలవుతుంది. రామాయణం స్టార్ కాస్ట్‌లో రణబీర్ కపూర్ (శ్రీరాముడు), సాయి పల్లవి (సీతాదేవి), యశ్ (రావణుడు), రవి దూబే (లక్ష్మణుడు) ఉన్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, ఇందిరా కృష్ణన్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Full View

Tags:    

Similar News