పోలీస్ బయోపిక్ తో రాబోతున్న బాలీవుడ్ డైరెక్టర్

Update: 2025-02-24 06:20 GMT

బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి పేరు వినగానే.. హై-ఆక్టేన్ యాక్షన్ సినిమాలు, భారీ కథనాలు, పోలీస్ డ్రామాల ప్రత్యేక శైలి గుర్తుకొస్తుంది. ‘సింఘం’ సిరీస్ నుంచి ‘సూర్యవంశీ’ వరకు.. శెట్టి క్రియేట్ చేసిన "కాప్ యూనివర్స్" శక్తివంతమైన పాత్రలు, రక్తి కట్టించే యాక్షన్ సీక్వెన్స్‌లు, దేశభక్తి భావోద్వేగాలు ప్రేక్షకులను అలరించాయి.





 


ఇప్పటి వరకు మసాలా ఎంటర్టైన్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శెట్టి.. ఇప్పుడు కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా.. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన పోలీస్ అధికారుల్లో ఒకరైన రాకేష్ మారియా జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తీయబోతున్నాడు . ఈ సినిమాలో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించనున్నాడు.


 



ఇప్పటి వరకు శెట్టి రూపొందించిన పోలీస్ కథలు కల్పిత పాత్రల చుట్టూ తిరిగాయి. అయితే, ఈసారి ఆయన రియల్ లైఫ్ పోలీస్ అధికారి జీవన ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించనున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేసిన మారియా.. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసును ఛేదించడంలో, 26/11 ముంబై దాడుల విచారణలో.. అలాగే షీనా బోరా హత్యకేసును వెలుగులోకి తేలుస్తూ కీలక పాత్ర పోషించారు.





 


"లెట్ మీ సే ఇట్ నౌ" అనే మారియా రాసిన ఆత్మకథ ఈ సినిమాకు ప్రధాన ఆధారంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సినిమాతో.. రోహిత్ శెట్టి సాధారణ మాస్ ఎంటర్టైన్మెంట్‌కు భిన్నంగా.. యథార్థత కలిగిన కథను ప్రేక్షకులకు అందించబోతున్నాడు. ఈ బయోపిక్‌పై ఇప్పటికే సినీప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రియల్-లైఫ్ పోలీస్ కథను రోహిత్ శెట్టి స్టైల్లో ఎలా మలుస్తాడో చూడాలి!

Tags:    

Similar News