కార్తిక్ ఆర్యన్, శ్రీలీల సినిమా వచ్చేది అప్పుడేనా?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ వాలెంటెయిన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.;
బాలీవుడ్ యూత్ స్టార్ కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల జోడీగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ ‘ఆశికీ 3’ సినిమా.. గతంలో ప్లాన్ చేసిన దీపావళి 2025 రిలీజ్‌ను దాటనుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ వాలెంటెయిన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ప్రొడక్షన్లో డిలే, కార్తీక్ బిజీ షెడ్యూల్ కారణంగా రీలీజ్ డేట్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కార్తీక్ ప్రస్తుతం ‘తూ మేరీ మైం తేరా.. మైం తేరా తూ మేరా’ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఇటీవల అతని లుక్‌ను “రే ఈజ్ రెడీ క్యాప్షన్‌తో విడుదల చేశారు. ఇది కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌తో అతని మొదటి కొలాబరేషన్. ఇది ‘దోస్తానా 2’ వివాదం తర్వాత వీరి మధ్య ఉన్న ఊహాగానాలకు తెరపడినట్లు కనిపిస్తోంది.
మరోవైపు.. అనురాగ్ బాసు తన కొత్త చిత్రం ‘మెట్రో ఇన్ డినో’ విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మొదటి పాట “జమానా లగే” ఈ వారంలో విడుదలైంది. అలాగే ఫస్ట్ లుక్ కూడా సానుకూల స్పందన పొందింది. అభిమానులు ఈ కొత్త చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, పంకజ్ త్రిపాఠి లాంటి బలమైన తారాగణం ఉంది.
మొత్తానికి ఈ షెడ్యూల్ జాప్యాల కారణంగా ‘ఆశికీ 3’ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. సినిమా సగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఆగస్టు తర్వాత మొదలవనుంది. కార్తీక్ ఈ సినిమాలో రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు. వాటికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న విడుదలయ్యాయి. ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.