షారుఖ్ ‘కింగ్’ లో మరో బాలీవుడ్ బిగ్గీ !
ఈ చిత్రంలో సీనియర్ హీరో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. షారుక్ ఖాన్ ఓ అసాసిన్ పాత్రలో కనిపించ నున్నాడు. ఈ కథలో అనిల్ కపూర్ అతని హ్యాండ్లర్ పాత్రను పోషించనున్నాడు.;
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తదుపరి చిత్రం "కింగ్" గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వార్’, ‘పఠాన్’ చిత్రాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ థియేట్రికల్ డెబ్యూ చేయబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది మరియు త్వరలో షూటింగ్ ప్రారంభమవనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సీనియర్ హీరో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. షారుక్ ఖాన్ ఓ అసాసిన్ పాత్రలో కనిపించ నున్నాడు. ఈ కథలో అనిల్ కపూర్ అతని హ్యాండ్లర్ పాత్రను పోషించనున్నాడు. ఈ పాత్ర కోసం అనేకమంది నటులను పరిశీలించినప్పటికీ, అనిల్ కపూర్‌కి సరిపోయే పాత్రగా భావించి చిత్రబృందం ఆయన్ని ఎంపిక చేసింది. ఈ పాత్రపై అనిల్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంలో షారుక్ ఖాన్‌తో కలిసి పని చేయడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారని సమాచారం.
సిద్ధార్థ్ ఆనంద్ గతంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఫైటర్’ సినిమాలో అనిల్ కపూర్ ఒక కఠినమైన ఆఫీసర్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఓ బలమైన పాత్రను సిద్ధార్థ్ రాశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా, దీపికా పదుకునే ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే అర్షద్ వార్సీ, అభయ్ వర్మ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.