‘కేసరి : చాప్టర్ 2’ లో కీలక పాత్రలో అందాల భామ

ఈ చిత్రంలో కీలక పాత్రలో.. అందాల భామ అనన్య పాండే అధికారికంగా ఎంపికైంది. మార్చి 28న చిత్రయూనిట్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. అనన్య పాండేను ‘దిల్రీత్ గిల్’ అనే పాత్రలో పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసింది.;

By :  K R K
Update: 2025-03-29 04:00 GMT

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ మూవీ ‘కేసరి: చాప్టర్ 2’. ఈ చిత్రంలో కీలక పాత్రలో.. అందాల భామ అనన్య పాండే అధికారికంగా ఎంపికైంది. మార్చి 28న చిత్రయూనిట్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. అనన్య పాండేను ‘దిల్రీత్ గిల్’ అనే పాత్రలో పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన ఘటనల ఆధారంగా ఈ పీరియడ్ డ్రామా తెరకెక్కుతోంది.

ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా అనన్య పాత్రను పరిచయం చేస్తూ... "అక్కడ జరిగిన దారుణం గురించి ప్రపంచానికి తెలియాలి" అనే సందేశంతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో అనన్య తెల్ల చీరలో న్యాయవాదిగా దర్శనమిచ్చింది. "కరుణతో కూడిన హృదయం, న్యాయం కోసం అంకితభావం" అనే శీర్షికతో ఆమె పాత్రను వివరించారు. ఈ ప్రకటనపై అనన్య పాండే స్నేహితులు నవ్య నందా, సుహానా ఖాన్, ఆమె తల్లి భావన పాండే.. అలాగే నటుడు సంజయ్ కపూర్ భార్య మాహీప్ కపూర్ వంటి ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవలే ‘కేసరి: చాప్టర్ 2’ అధికారిక టీజర్ విడుదలైంది. ఈ చిత్రం పుష్పా పాలట్ అండ్ రఘు పాలట్ రాసిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్యతో పాటు ఆర్. మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News