‘కేసరి చాప్టర్ 2’ తో రాబోతున్న ఖిలాడీ స్టార్ !

అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కేసరి చాప్టర్ 2’ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-03-22 03:37 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘కేసరి’ రిలీజై 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పోస్టును షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన కేసరి సీక్వెల్ గురించి సూచనలు ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 1897లో జరిగిన సరాగఢీ యుద్ధం నేపథ్యంలో 21 మంది సిక్కు సైనికులు 10,000 మంది ఆఫ్ఘన్ సేనతో పోరాడి చూపించిన ధైర్య సాహసాలను అక్షయ్ కుమార్ హవీల్దార్ ఇషర్ సింగ్ పాత్రలో గొప్పగా ఆవిష్కరించారు. ఈ సినిమా ఆయన నటనా జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

తాజాగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో సిక్కుల వీరత్వాన్ని ప్రదర్శిస్తూ.. కొత్త అధ్యాయం త్వరలో మొదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. “6 ఏళ్ల ‘కేసరి’ ఉత్సాహం, ‘కేసరి’ యొక్క భావనను గౌరవించుకుంటూ.. కొత్త అధ్యాయం ప్రారంభం.. త్వరలో.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కేసరి చాప్టర్ 2’ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సీక్వెల్ 1919 లో జరిగిన జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ నేపథ్యాన్ని చూపించ బోతోందని సమాచారం. ప్రత్యేకంగా.. బ్యారిస్టర్ సి శంకరన్ నాయర్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుందని చెబుతున్నారు. బ్రిటీష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఓ కీలక ఘట్టంగా నిలిచింది.

Tags:    

Similar News