650 స్టంట్ మెన్ కు ఇన్సూరెన్స్ చేయబోతున్న అక్షయ్
అక్షయ్ కుమార్, దేశవ్యాప్తంగా సుమారు 650 మంది స్టంట్‌మెన్, స్టంట్‌వుమెన్‌లకు ఇన్సూరెన్స్ అందించేందుకు ముందుకొచ్చారు.;
ఇటీవల దర్శకుడు పా రంజిత్ చిత్రం ‘వెట్టువం’ సెట్‌లో స్టంట్‌మ్యాన్ ఎస్‌ఎం రాజు మరణం భారతీయ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. స్టంట్‌మెన్‌ల ప్రమాదకర జీవితాలపై మరోసారి దృష్టి పడింది. 52 ఏళ్ల రాజు, నాగపట్నంలో జులై 13న ‘వెట్టువం’ మూవీ చిత్రీకరణలో ఓ ప్రమాదకర యాక్షన్ సీక్వెన్స్‌లో యస్యూవీ డ్రైవ్ చేస్తూ మరణించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో స్టంట్ కొరియోగ్రాఫర్ల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, దేశవ్యాప్తంగా సుమారు 650 మంది స్టంట్‌మెన్, స్టంట్‌వుమెన్‌లకు ఇన్సూరెన్స్ అందించేందుకు ముందుకొచ్చారు. సీనియర్ స్టంట్‌మ్యాన్ విక్రమ్ సింగ్ దహియా.. ‘ఓయమ్జీ 2, జిగ్రా, అంతిమ్, గుంజన్ సక్సేనా’ వంటి చిత్రాల్లో పనిచేసినవాడు. అక్షయ్ చేసిన ఈ మహత్తర కార్యానికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ ఇన్సూరెన్స్ పాలసీ.. సెట్‌లో లేదా సెట్ వెలుపల గాయాలైనా రూ. 5 లక్షల నుంచి రూ. 5.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్య చికిత్సను కవర్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలు అక్షయ్ చర్యను మెచ్చుకున్నారు, ఆలస్యమైనా అద్భుతం.. అని కొనియాడుతున్నారు. సినీ సెట్‌లలో ప్రాణాలు పణంగా పెట్టే స్టంట్‌మెన్, ఇతర టెక్నీషియన్‌లకు మరికొందరు స్టార్లు మద్దతు ఇవ్వాలని ఆశించారు.